Spread the love

యర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టే ఉద్దేశంతో ఎమ్మెల్యే శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ నిర్వహించిన “డయల్ యువర్ ఎమ్మెల్యే” కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో ప్రజలు ఫోన్ ద్వారా తమ సమస్యలు, వినతులు, సూచనలను ఎమ్మెల్యేకు నేరుగా వివరించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పనిచేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా పాలనను మరింత పారదర్శకంగా, ప్రజలకు చేరువగా మార్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *